RK Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై ప్రత్యేకించి టాలీవుడ్ హీరోయిన్ సమంతపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇలాంటి జుగుష్టకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి.
పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూస్తున్నాడని కేటీఆర్‌ను మంత్రి సీతక్క విమర్శించారు. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నారు. "మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని.. సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే అది బీఆర్‌ఎస్‌కు అపాది స్తున్నారని.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ ట్రోల్‌ను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. ట్రోల్‌లో ఎక్కువ మంది చూడలేదని.. కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ ఫొటో చూపిస్తేనే అందరికీ తెలిసిందన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎక్స్ లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నాడు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.." అని రాసుకొచ్చాడు.
కొండా సురేఖ ది తప్పే లేదని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్.. నీ సోషల్ మీడియా తప్పుగా ట్రోల్ చేసిందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సిందని సూచించారు. మీ సోషల్ మీడియా నీ కంట్రోల్ చేయకపోవడం తప్పన్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎక్స్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు. " సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు.
హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.
తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని…