సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు.
Konda Surekha: వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్య..
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కుట్ర కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Konda Surekha: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ బిడ్డ కవితని జైల్ నుంచి విడిపించడానికి బీజేపీకి ఆమ్ముకుంటాడన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం.. టీడీపీలో పని చేసిన పాల్వాయి రజినినీ ఎలా నియమించారు.. ఆంధ్ర వ్యక్తి నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ…