వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.
వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలన్నింటిని అమలు చేసి తీరుతామంటున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ…
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని, వారి అర్జీలను తీసుకున్నామని తెలిపారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త…
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.