Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
- బీజేపీపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదన్న కొండా సురేఖ
- . అది ఓ మతతత్వ పార్టీ అని వ్యాఖ్యానించిన మంత్రి
- అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నిస్తున్నారని… ఆ పార్టీ నాయకులు కుల గణన ఫామ్ తీసుకుని రాహుల్ గాంధి ఇంటికి వెళ్తే.. రాహుల్ గాంధీ కులం ఏంటో అడిగితే ఆయనే చెబుతారన్నారు. గత పది సంవత్సరాలలో ప్రజలకు సమస్య చెప్పుకునే వేదిక కూడా ఉండేది కాదని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పరిపాలన అందిస్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హామీ ఇచ్చామని.. ప్రగతి ఉన్నచోట ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు.
READ MORE: AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాక గాంధీ భవన్లో కార్యకర్తల కోసం, ప్రజల కోసం మంత్రుల ముఖాముఖి ఏర్పాటు చేయాలని కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖి మంచి సంప్రదాయం ఇది ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. కుల గణన అంశంలో ప్రజల్లో సైతం మంచి స్పందన వచ్చిందని.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కుల గణన బ్రిటిష్ కాలంలో జరిగిందని.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు. విశ్వంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే కుల వివక్ష ఉందని రాహుల్ మాట్లాడారన్నారు. సామాజిక న్యాయం జరగడంలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. 25 రోజుల లోపల కుల గణన సంపూర్ణంగా పూర్తి అవుతుందని.. ప్రతి ఇంటిలో ఏ కులం వారు ఎంత ఉన్నారో 56 ప్రశ్నలతో రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు. కుల గణన పూర్తయిన తర్వాత వాటి రిపోర్టు ఆధారంగా ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతివాళ్ళ కలలో కనిపిస్తున్నాయి కావచ్చు అందుకే వాటి గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!