మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు..
చిత్తూరు, తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. పీఎంఈవై మొదటి దశలో లో కేటాయించిన 70శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడించారు.
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది.
AP అంటే A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్ధసారథి అన్నారు. ఏపీని పెట్టుబడికి అనువైన ప్రాంతంగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. రూ. 15 వేల కోట్లు కేంద్రంతో మంజూరు చేయించడం అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్‌లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్‌లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు.
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు.