M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. ఎగ్జిబిషన్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. నిన్న బడ్జెట్ మీద పదేళ్లు అనుభవం ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండాడుతాం అన్నారని.. అలాంటి కేసీఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టినా.. మీలాగా గ్యాస్...స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదంటూ పేర్కొన్నారు.
అదానీ, అంబానీ ఆస్తిని కూడా సగటు భారత పౌరునితో పోల్చితే ఎలా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అట్లా చూసి సగటు పౌరుని జీవన ప్రమాణాలు పెరిగాయని ఎట్లా అంటారు అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.