జోగి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఓటు ఒక చోటే ఉండాలని కోరామని చెప్పుకొచ్చారు. కొంత మందికి తెలంగాణ, ఏపీ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి.. ఇలాంటి వాటిని వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని విఙప్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
మూడు ప్రాంతాలనుండి మూడు సామాజిక రథాలు ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కటౌట్ పెట్టి బస్ యాత్ర చేస్తేనే గ్రామాలు, పట్టణాలు, జన సంద్రంగా మారుతున్నాయన్నారు.
2024 ఎన్నికల్లో పోటీపై స్పందిచిన మంత్రి జోగి రమేష్.. తాను ఎంపీగా కాదు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు.. అది కూడా మళ్లీ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను.. గెలుస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి..
జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ భవిష్యత్తుకే గ్యారెంటీ లేని వాళ్ళు ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు.. దీని కోసం విస్తృత స్థాయి సమావేశం అట.. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు లాంటి నాయకుడు ఉండడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడట అని ఆయన మండిపడ్డారు.