Minister Jogi Ramesh: సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అయితే, ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి.. ఓ వైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండా.. మరోవైపు.. టీడీపీ-జనసేన ఏకమై కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.. ఇక, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. ఇదే సమయంలో.. సీట్ల విషయంలో ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి.. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా.. ప్రత్యామ్నాయంగా ఉన్న నేతలు కూడా వర్క్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Team India: ఈ వరల్డ్ కప్లో ఓటమెరుగని టీమిండియా.. అన్నింటిలోనూ నెంబర్ 1
2024 ఎన్నికల్లో పోటీపై స్పందిచిన మంత్రి జోగి రమేష్.. తాను ఎంపీగా కాదు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు.. అది కూడా మళ్లీ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను.. గెలుస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికల ముందు చాలా మంది వస్తారు.. ఏవేవో మాట్లాడుతుంటారు.. ఆ మాటలను ప్రజలు, మా నాయకులు పట్టించుకోరు అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. కాగా, గతంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు జోగి రమేష్‌కు మధ్య ఉన్న విభేదాలు పలు సందర్భాల్లో బహిర్గతం అయ్యాయి.. అవి సీఎం వైఎస్ జగన్ వరకు కూడా వెళ్లిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు పోటీపై.. తాను బరిలోకి దిగే స్థానంపై మంత్రి జోగి రమేష్ ప్రకటన చేయడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది.