మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Shabbir Ali: గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ
సమైక్య పాలకుల చేతిలో అన్నం తినడానికి లేని పరిస్థితి ఏర్పండింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలవి అబద్ధాల ప్రచారం.. బక్క పలుచని కేసీఆర్ తో తెలంగాణ వాస్తదా అని ఎగతాళి చేసిన నాయకులకు తెలంగాణ తెచ్చి చూపించారు అని మంత్రి అన్నారు.
Read Also: SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేసి ప్రతి పక్షాల నోరు మూయించిండు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నమ్మకానికి మారు పేరే కేసీఆర్ అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. అమ్మకానికి మారు పేరు ప్రతి పక్షాలు అని ఆయన విమర్శలు గుప్పించారు. వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు.. అన్ని అమ్ముకుంటారు.. నమ్మకం ఒక వైపు ఉంది.. అమ్మకం ఒక వైపు ఉంది అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ కి కానుక ఇద్దాం అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.