Harish Rao: త్వరలో 13 వేల టీచర్ పోస్టులు భర్తీ.. రెండు భాషల్లో బోధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్‌ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలన్నారు.. ఇక, పేదరికం వల్లే మనుషుల్లో తేడా వచ్చిందన్నారు హరీష్‌రావు.. పేదరికాన్ని రూపు మాపాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు.
Read Also: Talasani : గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు.. ఏది పడితే అది మాట్లాడొద్దు..!
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
మరోవైపు, విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్‌లలో కూడా రిజర్వేషన్ తెచ్చామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. విద్యలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా అందించేందుకు రూ.7,300కోట్లతో మన ఊరు మన బడి పథకం తెచ్చామని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో 13 వేల టీచర్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీచేస్తామని వెల్లడించారు. ఇక, తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో బోధనా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లో 50 శాతం దళితులకు అవకాశం కల్పించామన్నారు. స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు లేవు , త్వరలోనే అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!