Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 2014నుంచి 2022వరకు మాతృమరణాలు గణనీయంగా తగ్గాయని హరీశ్ రావు ట్వీట్ చేశారు. అతి తక్కువ ఎంఎంఆర్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం గతంతో పోలిస్తే మరణాల సంఖ్య తగ్గినట్టు పేర్కొన్నారు. గతంలో 56ఉండగా అది ప్రస్తుతం 43కు తగ్గిందన్నారు. ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ సర్కారున్న రాష్ట్రాలు వెనక బడ్డాయని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇదే క్రమంలో కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమం ‘వరల్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ పోగ్రామ్’గా నిలిచిందన్నారు.
Read Also: Kolkata Groom : వర్క్ ఫ్రం పెళ్లిపీటలు.. మనోడి కష్టాలు మామూలుగా లేవు
ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, క్వాలిటీ టీమ్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సారి కోటిన్నర మంతికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 25లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకు ముందు 1.54కోట్ల మంతికి పరీక్షలు చేసి, 50లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు.
Telangana implements – Nation Follows!
Maternal & child deaths have reduced significantly since 2014.
While India reduced Maternal Mortality Rate only by 25%, Telangana has reduced by MASSIVE 53% from 92 in 2014 to 43 in 2020. #Telangana ranks 3rd in overall reduction in MMR 1/2 pic.twitter.com/qN0K9SDMTk— Harish Rao Thanneeru (@trsharish) November 29, 2022