తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం చంద్రబాబు తహతహ లాడుతున్నారు… కానీ ఆయన భాష చూస్తే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారం ఎందుకు కోల్పోయామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు… సొంత నియోజకవర్గంలో ఓటమిపై సమీక్ష జరపకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అడిగి ఉండాల్సింది. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు పోయింది. ఆయనకు జవసత్వాలు లేవు.
ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఇక జిమ్మిక్కులు ఆపాలి… వాపు బలం అనుకుంటున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. చంద్రబాబు ఓటీఎస్ కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉంది…దీనిపై వడ్డీ కూడా మాఫీ చేయని ఘనత చంద్రబాబుది. కుప్పంలో అక్రమ మైనింగ్ పై చంద్రబాబు కోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ అనేది వాళ్ళ ఇష్టం.
మూడు రాజధానుల బిల్లులో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల వెనక్కు తీసుకున్నాం. బిల్లు ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే కొత్త బిల్లు ముందుకు వస్తుంది.మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను గానీ, పెద్దిరెడ్డిగానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సీఎం అభిమతంతోనే కేబినెట్ వుంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
కేబినెట్లో ఎవరు వుండాలి? ఎవరిని ఎప్పుడు దేనికి ఉపయోగించుకోవాలి. ఎవరిని విప్ లుగా నియమించాలి. ఎవరికీ సంతృప్తి, అసంతృప్తులు వుండకూడదు. పార్టీ బాధ్యతలు ఎప్పుడు ఎవరికి అప్పగించాలనేది సీఎం నిర్ణయిస్తారన్నారు. నూటికి నూరు శాతం పార్టీ లైన్ దాటి వెళ్లం. రాజకీయాల్లో పుట్టాను. నేను సీనియర్‌ని. సీఎం ఇష్టాయిష్టాలను మేం గౌరవించాలి. రాష్ట్రంలో ఎన్నో రాజకీయపార్టీలు వుంటాయి. మరో పార్టీ రావచ్చు. స్మార్ట్ సిటీలలో గేమ్స్ ని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి ఖర్చు వందల కోట్లు వుండదన్నారు.