ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా…
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని…మూడు, నాలుగు రోజుల్లో కమిటీ నివేదిక ప్రభుత్వానికి వస్తుందన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కమిటీ సూచనలు మేరకు విద్యార్థులకు మార్కులు ప్రకటిస్తామని.. విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బందులు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈనెలాఖరు లోపు విద్యార్థులకు ఫలితాలు ప్రకటిస్తామని… ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతదంగా జరుగుతాయని… ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు…