MLA Raja Singh: జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు.
Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా పలు కీలక అంశాలపై స్పందించారు. తనను జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ.. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాలకే అధ్యక్షుల నియామకం జరిగిందని, నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ చర్చలో లేదని తెలిపారు. ప్రజల ఆలోచనలు,…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి…
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ చంద్ర రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజా సింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. "కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతం రావు బీజేపీలో కొత్త వ్యక్తి కాదు.. రామ చందర్ రావు రాజా సింగ్ తో మాట్లాడారు.. పార్టీ లోని అందరితో మాట్లాడిన…
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ ఎంపికయ్యారు.. గతంలో 2009లో నూర్ ఖాన్ బజార్, 2016 లో డబిర్ పురా కార్పొరేటర్ గా గెలుపొందిన మీర్జా రియాజ్. 2019 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది.. 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తైంది.. ఎంఐఎం తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.
హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావుని పార్టీ ప్రకటించింది. గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. కాగా.. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.. గత నెల 27వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది.. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ అవకాశం…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను…