అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. మరోవైపు అమూల్ తాజా…