ఇటీవలి కాలంలో మనం తినే ఆహారం అయినా, తాగే పానీయాలు అయినా అన్నీ కల్తీతో నిండిపోతున్నాయి. కారం తయారీలో ఇటుక పొడిని కలుపుతున్నారు, మసాలాల్లో చెక్క పొడిని కలిపి విక్రయిస్తున్నారు. అల్లం పేరుతో అరటితొక్కను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఏ వస్తువును ముట్టుకున్నా కల్తీ తప్ప మరేమీ కనిపించని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేస్తోంది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సర్ఫ్, యూరియా, శుద్ధి…
భువనగిరి జిల్లాలో కల్తీపాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో ఇవాళ (బుధవారం) ఈ ఘటన వెలుగులో వచ్చింది.