గాజాలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు సైనిక ఆపరేషన్ మొదలు పెట్టాయి. బుధవారం భారీ స్థాయిలో ఐడీఎఫ్ దళాలు మోహరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హమాస్‌ను నిర్మూలించి.. బందీలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.