ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
Israel-Hezbollah: లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది.