ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్‌లోకి వదులుతున్నారు. breaking news, latest news, telugu news, big…