మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్‌లోకి వదులుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Sabitha Indra Reddy : ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వర్షాభావం రైతులను నిరాశపరిచినా సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రైతాంగాన్ని ఆదుకున్నదన్నారు. ఈ నీటితో దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుందని, జూలై 25 నుంచి లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటి విడుదల ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read : CM YS Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం సమీక్ష.. వాటిపై ఫోకస్ పెట్టండి..
ఎంఎండీలో 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, ఎల్‌ఎండీలో ఏడు టీఎంసీలున్నాయి. సూర్యాపేట వరకు ఎల్‌ఎండీ కింద 9.5 లక్షల ఎకరాలకు సాగు చేసేందుకు 40 నుంచి 50 టీఎంసీల నీరు అవసరమని, ఎంఎండీ, ఎల్‌ఎండీల్లో ఒక్కొక్కటి 20 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read : Harish Rao : మారథాన్ రన్‌లో అందరూ పాల్గొనాలి
ప్రజా ధనాన్ని వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని వినోద్ కుమార్ అన్నారు. అయితే అదే ప్రాజెక్టు ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకుంటున్నదని అన్నారు.