ఇటీవల మెట్రో రైలులో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో రైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ప్రజలకు హైదరాబాద్ మెట్రో సంస్థ స్ట్రాంగ్ నోటీసు ఇచ్చింది.
విశాఖ ప్రజలకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. ఈ మేరకు 76 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూజేఎం రావు వెల్లడించారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుపై శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 54 మెట్రో స్టేషన్‌లు, రెండు డిపోలు నిర్మిస్తున్నట్లు…
హైదరాబాద్‌లో మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయి… మెట్రో రైలు ఎక్కితే చాలు.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు… కోవిడ్ కంటే ముందు భారీ స్థాయిలో ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించిన.. కోవిడ్ మెట్రో ప్రయాణాన్ని దెబ్బకొట్టింది.. అయితే, మళ్లీ క్రమంగా మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు.. అయితే, ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం గంటకు 70 కిలో మీటర్ల వేగంతో మెట్రో రైళ్లు నడుస్తుండగా..…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం…
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.…
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్ పాస్ ఆఫర్… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్ మెట్రోల్ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం…
రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12…