ఫేస్‌బుక్ పేరు మార్చుకున్నది. మెటా వర్స్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది ఫేస్‌బుక్. మెటా వర్స్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. మెటా అనేది గ్రీక్ పదం. మెటా అంటే ఆవల అని, వర్స్ అంటే విశ్వం అని అర్ధం. అంటే విశ్వం ఆవల. భవిష్యత్తులో ఇదే కీలకం అవుతుందని ఫేస్‌బుక్ బలంగా నమ్ముతున్నది. ఊహా ప్రపంచానికి వాస్తవ అనుభూతికి కలిగించేలా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు.
ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ వర్చువల్‌గా కన్సోల్‌తో కంట్రోల్ చేయడం కాకుండా డైరెక్ట్‌గా ప్లేయర్ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించవచ్చు. మనకు కావాల్సిన వ్యక్తులను తెరపై కాకుండా నిజంగా మనముందే ఉన్నారు అనే అనుభూతిని కలిగించవచ్చు. ఎక్కడో ఉన్న వ్యక్తులు రియల్‌గా మనముందే ఉన్నట్టు అనుభూతి చెందే విధంగా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు.
ఫేస్‌బుక్‌కు సంబంధించిన అన్ని కంపెనీలను ఒకే గ్రూప్ కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఫేస్‌బుక్ పై వస్తున్న ఆరోపణల నుంచి బయటపడేందుకు మెటా వర్స్ ను తీసుకొస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, మెటా వర్స్ ప్రైవసీకి సంబంధించిన వివరాలను ఫేసుబుక్ పెద్దగా ప్రస్తావించలేదు. ఈ మెటావర్స్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. యూరప్‌లో 10 వేల మంది టెక్ నిపుణులను తీసుకోబోతున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది.
Read: అక్కడ రెండు తలల వింత దూడ జననం… వారం రోజుల తరువాత…