మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నంతో చక్కని అనుబంధం ఉంది. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి నటించిన చాలా సినిమాల షూటింగ్స్ వైజాగ్ లోనే జరిగేవి. అంతేకాదు… వైజాగ్ లో చిరంజీవి సినిమా షూటింగ్ జరిగితే… అది సూపర్ హిట్ అనే ఓ సెంటిమెంట్ కూడా మొదలైపోయింది. దాంతో కొంతకాలం పాటు సినిమా షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగినా… ఒకటో రెండో సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించేవారు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల ఫంక్షన్ ఏదో ఒకటి వైజాగ్ లో జరగడం ఆనవాయితీగా మారిపోయింది.
Read Also : జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్
ఇక విషయానికి వస్తే… ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని వైజాగ్ లోని చిరంజీవి అభిమానులు ఇప్పటికే తమ వంతు సేవాకార్యక్రమాలను నిర్వహించేశారు. దాదాపు 250 మంది చిరంజీవి అభిమానులు రక్తదానం చేశారు. అలానే సుమారు మూడు వేల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అందరూ కలిసి చిరంజీవికి విశాఖ సాగర తీరంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనిని ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోగా కట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ వీడియో ఇంకెంతమంది చిరంజీవి అభిమానులలో స్ఫూర్తిని నింపి, వారిని సేవా మార్గం వైపు నడుపుతుందో చూడాలి.