ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం…
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు..
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.
నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు(జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.
Harish Rao : తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్నికి చీమ కుట్టినట్టు లేదని., బిఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు. మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము. అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంది. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది.…