మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమేనా కాదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయారని.. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దని.. బాధ్యులపై చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో ఏం జరిగిందో చూపించారని అన్నారు.…
BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Medigadda Project: కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డను సందర్శించింది.
Ministers To Visits Medigadda Barrage on December 29: డిసెంబర్ 29న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు బయల్దేరి.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను గురించి మంత్రులు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు…
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల…
మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు.
ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వానల వల్ల వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా.. ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కాగా.. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో అత్యధికంగా 12.8 సెం.మీ. వర్షపాతం నమోదవగా.. ఎస్సారెస్పీలోకి 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కడెంలోనూ నీటిమట్టం పెరుగుతోంది. అయితే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లోకి ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. read also: Fraud…