కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
Kaleshwaram Project: కాంట్రాక్టులు పొందిన నిర్మాణ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా? లేక కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా? దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం ఉన్నందున ఈ వర్షాకాలంలోనే అన్ని గేట్లను తెరవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న మధ్యంతర పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే వారం రానున్నారు. తన పర్యటనకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు, మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీపై మధ్యంతర చర్యల అమలుకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముఖ్యమంత్రితో కలిసి బ్యారేజీ వద్దకు వస్తానని చెప్పారు. అయితే.. వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,…
Medigadda: వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫార్సులకు సంబంధించిన పనులను ఎల్‌అండ్‌టి ప్రారంభించింది.
Kaleshwaram Project: నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు.
తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. రేవంత్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్.. సీఎం రేవంత్ అంటూ ఆయన…
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్‌ఏకు లేఖ రాశారు.
MLC Jeevan Reddy: కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.