నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.
Government Jobs: నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. కోట్లాదిమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను పెంచి వైద్య విద్యను బలోపేతం చేస్తున్నామని ఆమె చెప్పారు. 300కు పైగా ప్రొసీజర్లను చేర్చి…
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో అనర్హులను అందలం ఎక్కించారని మండిపడుతున్నారు వైద్యాధికారులు. ఏళ్లుగా పని చేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ముగ్గురు జిల్లా వైద్యాధికారులను బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిజేస్తున్న డాక్టర్ పుట్ల శ్రీనివాసుకు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. యాదాద్రి…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్‌లో 33 జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్.. దేశంలో తొలిస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 100శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను అదేశించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో…
దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అనంతపురం జిల్లా వైద్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు. మరోసారి కరోనా ముప్పు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో పాటు వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 471…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల రగడ కలకలం రేపుతోంది. కరోనా పీక్‌లో ఉన్న సమయంలో తమ పనితీరుతో మంచిపేరు తెచ్చుకున్న వారికి ఆ నిర్ణయం మింగుడు పడటం లేదట. కానీ.. అసలు విషయం తెలుసుకుని ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారట. అదే ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. డిప్యుటేషన్ల రద్దుతో వైద్యశాఖలో కలకలం వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్…