Harish Rao : చరిత్రలో ఇది సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి వల్ల 2014లో 30శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు, రెట్టింపు కంటే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా నారాయణ్ పేట్ 89శాతం, ములుగు 87శాతం, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85శాతం డెలివరీలు చేసి మంచి పనితీరు కనబర్చాయని అభినందించారు. అతి తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్ (84.4), జోగులాంబ గద్వాల్ (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్ కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు.
Also Read : Balagam Actor Died: తీవ్ర విషాదం.. బలగం నటుడు కన్నుమూత
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంగళవారం నెలవారీ సమీక్ష టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల భారి నుంచి కాపాడటంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రోగాన్ని ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. గర్బిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, రూపాయి ఖర్చు భారం వారిపై పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక వేతనాలును అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా సపోర్టు చేస్తున్నారన్నారు.
Also Read : Article 370: ఆర్టికల్ 370 రద్దుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..
మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్స్, అమ్మఒడి వాహనాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క గర్బిణి కూడా పరీక్షల కోసం ప్రైవేటుకు వెళ్లొద్దనే ఉద్దేశ్యంతో టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న గర్బిణులు గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సేవలు పొందేలా చూడాలన్నారు. వందశాతం ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?