వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన…
ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని ఆయన వ్యాఖ్యానించారు. Kakinada: కుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్…