మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల…
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని…
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో 'సిద్ధం' సభ జనసంద్రమైంది. సభ జన సునామీని తలపిస్తుంది. కాసేపట్లో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, నేతలు 'సిద్ధం' సభలో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలని తెలిపారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఎంతమంది…
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇంకా శ్రేణులు భారీగా తరలివస్తుండటంతో రోడ్లపై ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్ధం సభ ప్రాంగణం నుంచి రెండు వైపులా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో కార్యకర్తలు, జనాలు నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు..…
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి…