అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు మహిళా దినోత్సవ కార్యక్రమం శుభపరిణామం అన్నారు మంత్రి తలసాని. తాగునీటి కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడేవారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను 50 శాతం పెంచాం. పేద, మధ్య తరగతి మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా…