భారత్ లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి కి చెందిన మారుతి ఫ్రాంక్స్ SUV విభాగంలో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ SUV పెట్రోల్, CNG ఆప్షన్స్ లో లభిస్తుంది. మీరు మారుతి ఫ్రాంక్స్ CNG వెర్షన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు…
ఆటోమొబైల్ కంపెనీలు కార్ లవర్స్ కు షాక్ ఇవ్వబోతున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ తమ మోడల్ కార్లపై ధరలు పెంచబోతున్నాయి. రేపటి నుంచే కార్ల ధరలు పెరగనున్నాయి. మారుతి సుజుకి మరోసారి తన కార్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నుంచి కార్లు ప్రియం కానున్నాయి. మారుతి తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను వచ్చే నెల నుంచి 4 శాతం వరకు పెంచుతామని తెలిపింది. 2025 సంవత్సరంలో మారుతి…
మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
Maruti Suzuki: దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ప్రియులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తాజాగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. ఈ పెంపు అత్యధికంగా 4% వరకు ఉండనుందని తెలిపింది. Read Also: Rohit Sharma:…
దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
మారుతి సుజుకి జిమ్నీ కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఆ కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రతి నెలా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో జిమ్నీని కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష నగదు తగ్గింపు లభిస్తుంది. అయితే.. కంపెనీ దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ను అందించడం లేదు.
మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మారుతి సుజుకి ఇండియా కొత్త మోడల్ సెలెరియోను విడుదల చేసింది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అమర్చింది. అంతేకాదు లేటెస్ట్ అప్డేట్తో కంపెనీ ఈ కారు ధరను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ .7.37 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.