భారత్ లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మారుతి సుజుకి కి చెందిన మారుతి ఫ్రాంక్స్ SUV విభాగంలో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ SUV పెట్రోల్, CNG ఆప్షన్స్ లో లభిస్తుంది. మీరు మారుతి ఫ్రాంక్స్ CNG వెర్షన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం.
Also Read:Team India Schedule: స్వదేశంలో జరిగే టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. వైజాగ్‌లో మ్యాచ్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.47 లక్షలు. ఈ SUV ని ఢిల్లీలో కొనుగోలు చేస్తే, దాదాపు 59 వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చుతో పాటు, దాదాపు 44 వేల రూపాయల బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని ఆన్-రోడ్ ధర రూ. 9.50 లక్షలు అవుతుంది. హైదరాబాద్ లో కూడా దాదాపు ఇదే ధర ఉండనున్నది. అయితే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత బ్యాంకు నుంచి దాదాపు రూ. 7.50 లక్షల మొత్తాన్ని లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును గుజరాత్ కట్టడి చేస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న గుజరాత్
బ్యాంకు మీకు 9 శాతం వడ్డీతో ఏడు సంవత్సరాల పాటు రూ. 7.50 లక్షలు ఇస్తే, మీరు రాబోయే ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 12,070 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఏడు సంవత్సరాలలో మీరు మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్ కోసం దాదాపు రూ.2.63 లక్షల వడ్డీని చెల్లిస్తారు. ఆ తర్వాత కారు మొత్తం ధర ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్, వడ్డీతో సహా దాదాపు రూ. 12.13 లక్షలు అవుతుంది.