చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.
నల్లారి బ్రదర్స్.. అంటే తెలియనివారుండరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. ఆయన సోదరుడు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. అయితే, ఈ అన్నదమ్ములు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.. చాలా కాలమంటే.. ఏకంగా సంవత్సరాలు గడిచిపోయింది.. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది.. ఒకే వేదికపై నల్లారి బ్రదర్స్ అంటే.. ఏదో పొలిటికల్ మీటింగ్ అని మాత్రం అనుకోవద్దు.. ఎందుకంటే.. వారు ఓ శుభ కార్యానికి హాజరయ్యారు..…
మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు…
వివాహం అంటే మాములు తంతు కాదు. అతిథుల నుంచి అప్పగింతల వరకు ఎంతో తతంగం ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని పెళ్లిళ్లు పీటల మీదే ఆగిపోతున్నాయి. వధూవరుల్లో కొంతమంది కుటుంబసభ్యులకు షాకులు కూడా ఇస్తున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే పెళ్లి ఆగిపోతే తమ పరువు పోయినంతగా ఫీలయిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి సందర్భంగా ఓ కుటుంబం ముందస్తు జాగ్రత్తగా ప్లాన్ Bని ముందే సెట్ చేశారు.…
దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్‌కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో…