ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం గదిలోని నమూనాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Apple iPhone 15: హీట్ అవుతున్న ఐఫోన్ 15 ఫోన్లు.. కారణాలు గుర్తించిన యాపిల్..
వివరాల్లోకి వెళ్తే.. హబీబ్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల పింకీగా గుర్తించారు. తన ఇంట్లో ఓ గదిలో నిద్రిస్తుండగా.. రాత్రి గుర్తు తెలియని హంతకుల చేతిలో దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన విధానం చూస్తే.. ఇటుకలు, రాళ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సెంట్రల్ నోయిడా డీసీపీ సునీతి సింగ్ మాట్లాడుతూ.. హత్యకు గల కారణాలపై బాలిక కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యకు గల కారణాలు తెలుస్తాయని.. త్వరలో నిజాలు బయటకు వస్తాయని డీసీపీ పేర్కొంది.
Read Also: NTR : ఎన్టీఆర్ తో కలిసి అల్లరి చేస్తున్న ఆ పాప ఎవరో తెలుసా..?
అయితే మృతురాలికి పెళ్లి సంబంధం కుదిరిందని.. డిసెంబర్ లో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు బాలిక హత్యకు గురైనప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈ హత్య ఘటన రాత్రి జరిగితే.. మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు హత్యకు సంబంధించి పోలీసులు కుటంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే.. నిందితులు ఎవరనేది తెలిసిపోతుంది.