Maoist Top Commanders: దేశంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల త్రి-రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న ఒక ప్రధాన ఆపరేషన్‌లో నక్సల్ ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర కమాండర్ మాద్వి హిడ్మాను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మిగిలిన అగ్ర నక్సలైట్లలో భయాందోళనలను విజయవంతం సృష్టించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో బతికి ఉన్న…
తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టు కీలక నేత ప్రసాదరావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. ఆయన తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. అయితే.. మావోయిస్టు లొంగుబాటులో తెలంగాణ SIB కీలక ఆపరేషన్ నిర్వహించింది. పార్టీ ఐడిలయాలజీ ని నిర్మించిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
Maoist Surrender: మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు.
Venugopal Rao: మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను తనతో పాటు 60మంది మావోయిస్టు కేడర్లు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన సోను లొంగిపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత సెప్టెంబర్‌లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను మావోయిస్టు మార్గాన్ని వదిలి…
నిషేధిత సీ.పి.ఐ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యుడు, దండాకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన మంద రూబెన్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోల నుంచి కాల్పులు విరమణ ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కాల్పుల విరమన ప్రసక్తే లేని ఆదివారం అన్నారు. శాంతిని కోరుకునే వారు వెంటనే లొంగిపోవాలనే హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులకు గట్టి షాక్ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య వ్యక్తులు తాజాగా పోలీసుల వలలో చిక్కారు. అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిపి రూ. 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం, వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒక రోజు ముందు, సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త…
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు…