Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆశన్నదే. 1999లో రాజకీయ, పోలీసు అధికారుల హత్యలతో ఆశన్నకి సంబంధం ఉందని నిఘా రికార్డులు చెబుతున్నాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC)లోని మాడ్ విభాగానికి నాయకత్వం వహించిన రనిత కూడా లొంగిపోయారు.
READ MORE: Bihar Elections: మజ్లిస్ పార్టీ అభ్యర్థి విందులో బిర్యానీ కోసం తన్నులాట.. వీడియో వైరల్
తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతుల పెద్ద కుమారుడు. ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన ఆయన.. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. 2010 ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో చేరారు. దాడుల వ్యూహాలను రూపొందించడంలో, బాంబుల తయారీలో చేయి తిరిగిన ఆశన్న.. ఐపీఎస్ ఉమేష్‌చంద్ర, మాజీ హోం మంత్రి మాధవరెడ్డిపై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆశన్నదే. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హత్యకు 2003, 2007లో రెండుసార్లు దాడి చేశారని రికార్డుత్లో ఉంది.