Maoist Leader Hidma: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. కేవలం 50 ఇళ్లున్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇళ్లు మూతపడగా.. గ్రామస్థులు భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించగా, గ్రామంలోని బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హిడ్మా అంత్యక్రియలకు గ్రామంలో ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.
Harbhajan Singh: పాకిస్థాన్ ప్లేయర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్.. నెటిజన్స్ ఫైర్!
పువర్తి గ్రామం మావోయిస్టు చరిత్రలో కీలక స్థానం ఉన్నదిగా భావిస్తారు. 50 ఇళ్లే ఉన్న గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టుల్లోకి మార్చిన హిడ్మా, ఇక్కడి యువతపై తీవ్ర ప్రభావం చూపాడని భద్రతా సంస్థలు పేర్కొంటాయి. హిడ్మా తరువాత ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా కీలక నేతగా ఉన్నాడు. ఈ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టుల నియంత్రణలో ఉండటంతో భద్రతా వ్యవస్థలు ఇక్కడ ప్రవేశించలేకపోయాయి. దశాబ్దాల తర్వాత కేవలం ఏడాది క్రితమే సీఆర్‌పీఎఫ్ ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. అయితే మావోయిస్టు ప్రభావం ఎంత బలంగా ఉందో ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరింత స్పష్టమైంది. పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లలో కేవలం 31 ఓట్లు మాత్రమే పోలవగా, ఈ గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఇక హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కలిపి మొత్తం 1 కోటి 80 లక్షల రివార్డు ప్రకటించడంతో అతను అత్యంత వాంటెడ్ మావోయిస్టు నేతగా గుర్తింపు చెందాడు.
Orry Drug Case: రూ.252 కోట్లు డ్రగ్స్ కేసులో ఓర్రీకి ముంబై పోలీసుల నోటీసులు