Maoist Leader Hidma: అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పరిణామాలు కారణంగా మావోయిస్టులు అక్కడి నుంచి ఏపీలోకి రావాలని చూస్తున్నారు.. మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాం.. ఇంటెలిజెన్స్ నుంచి రెండు రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చింది.. మావోయిస్టు నేతలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని చూశారు. కానీ, ఇవాళ ఉదయం మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర వెల్లడించారు.
Read Also: Leaders Sentenced: ప్రపంచంలో మరణశిక్ష పడ్డ అధ్యక్షులు, ప్రధానులు వీరే!
ఇక, ఈ ఎన్ కౌంటర్ ఘటన స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు ఏకే 47 తుపాకులు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బ్యారెల్ తో పాటు ఎలక్ట్రిక్ డెటర్నేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటైనేటర్లు, పేలుడుకు ఉపయోగించే ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.