ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది.
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచినందుకుగానూ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. అయితే రాజకీయ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులపై సోమవారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువ�
ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
న్యూయార్క్ టైమ్స్‌లో ఢిల్లీ విద్యా విధానంపై ఆర్టికల్ రాశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. ఇది తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని.. టీచర్ల ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందన్నారు. నిన్న తన నివాసంతో పాటు సచివాలయం కార్యాలయంలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారన్నారు.
ల్లీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు జరిపిన కొన్ని గంటల తర్వాత శుక్రవారం ఒక డజను మంది ఐఏఎస్ అధికారులను శాఖల మధ్య బదిలీ చేశారు.
సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై దాడులు చేయగా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన జాతీయ మిషన్‌లో చేరాలని కోరుతూ 'మిస్డ్ కాల్' ప్రచారాన్ని ప్రారంభించారు.