నందితా శ్వేత నాయికగా రూపుదిద్దుకున్న సింగిల్ క్యారెక్టర్ మూవీ 'రా... రా... పెనిమిటి'. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. సినిమా ఇదే నెల 28న జనం ముందుకు రాబోతోంది.
ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.