గానం… సంగీతం… తోడయితేనే వీనులకు విందు. వీటిలో ఏది మరో దానితో జోడీ కట్టకపోయినా, ఏదో వెలితి ఉంటుంది. అలాంటి వెలితి అన్నది లేకుండా తమ సంసారనౌకను ఆనందసాగరంలో సాగించేందుకు పూనుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మహతీ స్వరసాగర్, గాయని సంజనా కల్మంజే. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతీ స్వరసాగర్. తండ్రి బాటలోనే పయనిస్తూ బాణీలు కడుతున్నాడు. ఎంచక్కా పదనిసలు పలికిస్తూ, సరిగమలతో సావాసం చేస్తూ ఇప్పటికే ఏడు సినిమాలకు స్వరకల్పన చేసేశాడు మహతీ…