Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చంద్రయాన్-3ని మిషన్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
చంద్రుడిపై ఉపరితలాన్ని అణ్వేషించడానికి రోవర్ ని పంపడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. చంద్రుడిపై రోవర్ ని విజయవంతంగా దించితే ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన భారత్ నిలుస్తుందని.. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు.
Read Also: Allu Aravind: నేనేదో సరదాగా అంటే లావణ్య మా వాడినే ప్రేమించింది..అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
చంద్రయాన్-2లో జరిగిన ఆ తప్పులను రిపీట్ కానివ్వమని ఆయన అన్నారు. నాలుగు ఏళ్ల ముందు 2019లో చంద్రయాన్-2 ప్రయోగంలో ప్రజ్ఞాన్ రోవర్ దాని ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలాయి. చివరి నిమిషాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుకున్న మార్గం నుంచి ల్యాండర్ విక్రమ్ పక్కకు జరిగింది. చివరి నిమిషాల్లో ల్యాండింగ్ కు ముందు చంద్రుడిపై కూలిపోయింది. కానీ ఈ సారి కొన్ని అంశాల్లో విఫలమైనప్పటికీ.. విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా కొత్త మిషన్ రూపొందించామని సోమనాథ్ వివరించారు. ఇంజన్ ఫెయిల్యూర్, సెన్సార్ ఫెయిల్యూర్, కాలిక్యులేషన్ ఫెయిల్యూర్, అల్గారిథమ్ ఫెయిల్యూర్ వంటి వైఫల్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
చంద్రయాన్-2లో ఉపయోగించిన లాంచ్ వెహికిల్ నే చంద్రయాన్-3లో ఉపయోగిస్తున్నామని, అయితే కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ మొత్తం 9 పరికరాలను తీసుకెళ్తే.. కొత్త ఆర్బిటర్‌లో లోన్ ఇన్-సిటు పరికరం స్పెక్ట్రో పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(SHAPE) ఉంటుంది. ఇండియా తొలిసారిగా 2008లో చంద్రుడి చుట్టూ తిరిగేందుకు మొదటిసారిగా ఒక ప్రోబ్ ని పంపింది. 2014లో అంగారకుడిపైకి ‘మంగళయాన్’ అనే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తొలి ప్రయత్నంలోనే కుజుడి కక్ష్యలో శాటిలైట్ ను ప్రవేశపెట్టిన తొలిదేశంగా కీర్తి గడించింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ‘గగన్ యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది.