మంగళూరులో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు నిరసన చేపట్టారు. ఒక కాన్వెంట్ స్కూల్‌లో హిందూ దేవుళ్లను అవమానించడం, విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో విద్యార్థులతో కలిసి మితవాద సంఘాలు నిరసనలు చేపట్టారు. కాథలిక్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు.. హిందూ దేవుళ్లను అవమానించడం, హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.
CM Bommai assures action in Mangaluru murder case: కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.
కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని కాటిప్పళ్లలో శనివారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు 45 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. దీనిని అనుసరించి, జిల్లా యంత్రాంగం డిసెంబర్ 25 ఉదయం 6 నుంచి డిసెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు నగర శివార్లలోని సూరత్‌కల్, బజ్పే, కావూరు, పనంబూర్‌లలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించింది.
Bajrang Dal wants ban on New Year parties in Mangaluru: హిందూ సంస్థ భజరంగ్ దళ్ న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూర్ నగరంలో న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలని కోరుతోంది. ఇందు కోసం భజరంగ్ దళ్ మంగళూర్ పోలీస్ కమిషనర్కు ఒక మొమోరాండం కూడా సమర్పించింది. ముస్లిం యువకులు ‘‘ లవ్ జిహాద్’’ కోసం బార్లు, పబ్బులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. దీంతో మంగళూర్ వ్యాప్తంగా న్యూఇయర్…
లవర్స్ అన్నాక.. అనేక విషయాలపై ఫోన్లు, చాటింగ్‌లు, మీటింగ్‌లు జరుగూతనే ఉంటాయి.. ప్రేమగా.. ఫన్నీగా.. తిట్లు, ఏడుపులు, పెడబొబ్బలు.. నిక్ లేమ్‌లు.. ఇలా గంటల తరబడి కాల్స్ మాట్లాడడం.. చాటింగ్ చేసుకోవడం మామూలైన విషయమే.. అయితే, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సరదా చాటింగ్ ఇప్పుడు ఏకంగా విమానాన్నే ఆపేసింది.. విషయం ఏంటంటే.. ఇద్దరి మధ్య చాటింగ్ బాగానే ఉంది.. కానీ, ఆ చాటింగ్‌ను పక్క వ్యక్తి తొంగిచూడడంతోనే అసలు సమస్యకు కారణమైంది.. Read Also: ICC:…
Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
కర్ణాటకలోని మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్లను సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం.. కానీ, మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మంగళూరులోని నెహ్రూ మైదాన్ వీధుల్లో మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన ఓ దొంగను ఎస్ఐ వెంబడించడం చూసి అంతా నోరువెల్లబెట్టారు.. అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్…