Flight delayed over couple mobile chat: లవర్స్ చాటింగ్.. గంటల తరబడి నిలిచిపోయిన విమానం.. ఒకే పదం.. ఎంత పనిచేసింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవర్స్ అన్నాక.. అనేక విషయాలపై ఫోన్లు, చాటింగ్‌లు, మీటింగ్‌లు జరుగూతనే ఉంటాయి.. ప్రేమగా.. ఫన్నీగా.. తిట్లు, ఏడుపులు, పెడబొబ్బలు.. నిక్ లేమ్‌లు.. ఇలా గంటల తరబడి కాల్స్ మాట్లాడడం.. చాటింగ్ చేసుకోవడం మామూలైన విషయమే.. అయితే, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సరదా చాటింగ్ ఇప్పుడు ఏకంగా విమానాన్నే ఆపేసింది.. విషయం ఏంటంటే.. ఇద్దరి మధ్య చాటింగ్ బాగానే ఉంది.. కానీ, ఆ చాటింగ్‌ను పక్క వ్యక్తి తొంగిచూడడంతోనే అసలు సమస్యకు కారణమైంది..
Read Also: ICC: ధోనీ రిటైర్మెంట్‌కు రెండేళ్లు.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన ఐసీసీ
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ప్రేమికుల చాటింగ్‌తో ఆరు గంటల పాటు విమానం నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 14వ తేదీన ఆదివారం మధ్యాహ్నం మంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒక విమానం మంగళూరు నుంచి ముంబై బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది.. కానీ, అప్పుడే ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన చాటింగ్ విమానం ఎగరకుండా ఆపేసింది.. ఓ యువకుడు, తన ప్రేయసితో సరదాగా చాటింగ్ చేస్తున్నాడు.. తన ప్రేయసి కూడా అదే ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు మరో విమానం కోసం ఎదురు చూస్తున్నారు.. అయితే, ఇద్దరూ సరదాగా అక్కడి సెక్యూరిటీ గురించి వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు.. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ అంటూ తన ప్రియుడికి మెసేజ్ చేసింది ప్రేయసి.. ఆ మెసేజ్‌ను ఆ యువకుడి పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి చూడడమే అసలు సమస్య కారణం అయ్యింది.. అది చూసి భయంతో వణికిపోయిన సదరు ప్రయాణికుడు ఆ యువకుడు నిజంగానే బాంబర్ అయ్యుండొచ్చని కంగారుపడిపోయాడు.. వెంటనే ఆ విషయాన్ని విమాన సిబ్బందికి చేరవేశాడు..
ఇకేముందు.. అనుకున్నదే జరిగింది.. ఎగరాల్సిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లోనే ఆగిపోయింది.. ఆ తర్వాత విమాన సిబ్బంది, భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. ముందు జాగ్రత్తగా విమానం నుంచి ప్రయాణికుల్ని దించేసి, లగేజీతోపాటు విమానం మొత్తం పూర్తిగా తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. సదరు యువకుడినే కాదు.. అతడితో చాటింగ్ చేసిన పాపానికి అతగాడి ప్రేయసిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. దీంతో ఆమె బెంగళూరు విమానం కూడా వెళ్లిపోయింది.. చివరకు విమానంలో ఎలాంటి బాంబు లేదని, అతడు బాంబర్ కాదని.. అదంతా సరదా సంభాషణగా తేల్చేసిన భద్రతా సిబ్బంది.. ఆరు గంటలు ఆలస్యంగా ముంబైకి విమానాన్ని టేకాన్ చేశారు..
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?