Table-Top Runways: నేపాల్‌లో ఈ రోజు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలోని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలైన పైలెట్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్ట రన్ వేలు కలిగిన విమానాశ్రయాలు నేపాల్‌లో ఉన్నాయి. ఈ రన్ వేల కారణంగా ఇప్పటికే పలుమార్లు నేపాల్‌లో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విమాన ప్రమాదాలకు ‘టేబుల్ టాప్ రన్ వేస్’’ కారణమవుతున్నాయి.