ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.
Nara Lokesh vs Murugudu Lavanya in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ రెండోసారి అధికారం చేపడుతుందా?.. లేదా కూటమి విజయం సాధిస్తుందా? అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ఉంది. గత ఎన్నికలో ఓడిన ఆయన విజయం సాధిస్తారా? లేదా రెండోసారి…
డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా.. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2500 మందితో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. వచ్చే 45 రోజులు…
ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు.