GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త పన్ను విధానంతో ప్రజలకు ఊరట లభించింది. రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం ముందడుగేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్పందించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారన్నారు రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం…
పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు…
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో అనంతపురం గంగమ్మ తల్లిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు.