ప్రతి రోజు మందారం నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా మందారం పువ్వును పూజల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఎంతో విలువైనవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో మందారాన్ని వివిధ రకాల వ్యాధుల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే మందారం నీటిని సేవించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రోజు మందారం నీరు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.…