ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని…
‘మా’ ఎన్నికల అధికారిగా గెలిచిన మంచు విష్ణు ఇప్పటికే పదవీ బాధ్యతలను చేపట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా ఆయన మొదటి సంతకం ఆగిపోయిన పెన్షన్స్ ఫైల్ పై చేశారు. ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో…
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు…
మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా…
అక్టోబర్ 10న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ మంచి మెజారిటీతో గెలిచింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. ఈరోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసి, పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ ఫైల్ పై సంతకం చేశాడు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ నిన్న తమ పదవులకు రాజీనామా చేసారు. వారంతా ‘మా’లో సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే తాము గెలిచినప్పటికీ తమ పదవులను…
పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా బెనర్జీ వంటి నటులు పలు ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన సందర్భంగా మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి…
‘మా’లో ఎన్నికలు ముగిసినా యుద్ధవాతావరణంలో మార్పు లేదు. మా సభ్యులు మెజారిటీ మంచు విష్ణు ప్యానెల్ కి కట్టబెట్టినా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కూడా కొంత మందిని గెలిపించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ని, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీని, జాయింట్ సెక్రెటరీగా ఉత్తేజ్ ని… అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 8 మందిని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిపించారు. అయితే వీరందరూ మంగళవారం తమను ఎన్నుకున్న మెంబర్లకు సారీ చెబుతూనే…